(రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం ఆగస్టు 12:)
మై విలేజ్ మాడల్ విలేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చింతల బాలరాజ్ గౌడ్ గారి జయంతి సందర్భంగా మహేశ్వరం బాలుర ఉన్నత పాఠశాలలో ప్రతిభ పురస్కారాలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది… ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేయడం జరిగింది…
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలరాజ్ గౌడ్ సతీమణి చింతల మంగ ,కుమారుడు చింతల నితిన్ గౌడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ ఆమంగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ పాపిశెట్టి రాము తుక్కుగూడ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి శృతిలయ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపకులు దార్ల చిత్తరంజన్ దాస్ జనరల్ సెక్రటరీ వనం విజయ్ కుమార్ శ్రీను నాయక్ భుజంగం మరియు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది..
