వలిగొండ, ఆగస్టు 21 రాయల్ పోస్ట్ న్యూస్ /
ఈనెల 31న హైదరాబాద్‌లో నిర్వహించనున్న చలో ఇందిరాపార్క్ మహాధర్నాను ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో నిర్వహించిన సీపీఎం జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ
యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక పోరాటాలు నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వం నిధులు విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దీనిని నిరసిస్తూ ఆగస్టు 29,30,31 తేదీలల్లో భువనగిరి అంబేద్కర్ చౌరస్తా నుంచి హైదరాబాద్ ఇందిరాపార్క్ వరకు మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బునాదిగాని కాలువ పనులు పూర్తి చేయాలని కరువు ప్రాంతంగా ఉన్న జిల్లాలో సగ భాగానికి సాగునీరు అందించే బునాదిగాని కాలువ పనులు ప్రారంభమై దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ రైతులకు సాగునీరు అందలేదని జహంగీర్ ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు మారుతున్నా రైతుల సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వాలు ప్రకటనలు చేయడం తప్ప పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు.
పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో భువనగిరి నుంచి హైదరాబాద్ వరకు చేపడుతున్న పాదయాత్రలో వందలాది మంది ప్రజలు, రైతులు పాల్గొనాలని, ఆగస్టు 31న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటీ సభ్యులు గణపతి రెడ్డి, మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు కొమ్మిడి లక్ష్మారెడ్డి, పిఎన్‌ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, మండల కార్యదర్శివర్గ సభ్యులు వాకిటి వెంకట్ రెడ్డి, శాఖ సహాయ కార్యదర్శి వేముల నాగరాజు, సీనియర్ నాయకులు దొడ్డి బిక్షపతి, వరికుప్పల యాదయ్య, వడ్డేమాన్ వెంకటయ్య, కొమ్మిడి సత్తిరెడ్డి, వనం యాదయ్య, ఈర్ల రమేష్, వడ్డమాని రవి, వరికుప్పల బాబు, వడ్డెమాని మధు, సందెల లింగస్వామి, శ్రీశైలం, వెంకటేశం, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
