మోడీ ప్రభుత్వం తెచ్చిన SIR ప్రక్రియతో ప్రజలకు ఇబ్బందులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడానికి బిజెపి కుట్ర– బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ భువనగిరిలో విమర్శ

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 9/ భువనగిరి 94 అసెంబ్లీ నియోజకవర్గంలోని 23, 21, 24వ వార్డు, బూత్ నంబర్లు 86, 89 పరిధిలో కొనసాగుతున్న (ఓటరు జాబితా ప్రత్యేక సవరణ) ప్రక్రియలో బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు ఆబాది బూతుల ఇంచార్జ్ పాల్గొన్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్ అనిల్ నాయక్, ఆర్‌పి మంజుల, బొట్టు రాధలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు ప్రత్యక్షంగా 23 వ వార్డు స్థానిక కౌన్సిలర్ బర్రె పూజిత – జహంగీర్ ఏర్పాటుచేసిన ప్రత్యేక బూతు వద్ద ఓటర్లకు నింపడంలో సహాయం చేశారు.
ఈ సందర్భంగా బర్రె జహంగీర్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న SIR విధానం వల్ల సాధారణ ఓటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులైన ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటర్లకు ఏ విధంగానైనా తొలగించుటకు బిజెపి ప్రత్యక్ష ప్రణాళిక ద్వారా అవసరానికి మించిన పత్రాలు, క్లిష్టమైన ప్రక్రియ కారణంగా పేదలు, వృద్ధులు, నిరక్షరాస్యులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి పౌరుడికి సులభమైన విధానాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
ఓటర్ల హక్కులను పరిరక్షించేందుకు తాము స్వయంగా ఇంటింటికీ వెళ్లి ఫారాలు నింపుతూ సహాయం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తమ పేర్లు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా సహకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి మజార్, బండారు రవివర్ధన్, కరకాల సుదర్శన్, బండారు అశోకవర్ధన్, బర్రె క్రాంతికుమార్, భూషపాక మల్లేష్, బర్రె మోహన్, కర్కాల పోచయ్య పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article