అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి….ఎస్టీ లకు ఉచిత ప్రవేశాలు…..భువనగిరి కో- ఆర్డినేటర్డాక్టర్ గంజి రమేష్

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 7/ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని భువనగిరి శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరంలో బీఎ, బీకమ్, మరియు బీఎస్సీ (B.A, B.Com & B.Sc) కోర్సులలో అడ్మిషన్లు పొందుటకు ఆగస్టు నెల 7వ తేదీ వరకు అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సెంటర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ గంజి రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనగిరి స్టడీ సెంటర్ లో ఈ విద్యా సంవత్సరం నుండి సైన్స్ ప్రాక్టికల్స్ స్టడీ సెంటర్ లోనే నిర్వహిస్తారని ఆయన అన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ విద్యాభ్యాసం, అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను పొందుటకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో ఉద్యోగం చేస్తూ, చదువును మధ్యలో ఆపేసిన వారు, గృహిణులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరం నుండి ఎస్టీలకు (గిరిజనులకు) ఉచితంగా డిగ్రీ ప్రవేశ సౌకర్యం కల్పించిందని, ఇట్టి అవకాశాన్ని ఎస్టీ లు వినియోగించుకోవాలని కోరారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కొరకు ఈ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్, ఇతర యూనివర్సిటీల డిగ్రీ సర్టిఫికెట్ లతో సమానమని ఆయన అన్నారు.అ లాగే డిగ్రీ చదువుతున్న సెకండ్ ఇయర్ మరియు థర్డ్ ఇయర్ విద్యార్థినీ విద్యార్థులు వారి యొక్క ట్యూషన్ ఫీజు చెల్లించడానికి కూడా ఆగస్టు 7 వ తేదీ వరకు చివరి అవకాశం ఉందని, మరింత సమాచారం కొరకు స్టడీ సెంటర్ జాక్ట్ బొజ్జ బాలయ్య, సెల్ 90005 90545 ను సంప్రదించాలని ఆయన తెలిపారు.

📄 Generate e-Paper Clip
Share This Article