కూకట్పల్లి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ & మిల్క్ పథకం ప్రారంభం

1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ కూకట్ పల్లి జూన్ 16/ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కూకట్పల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మొయిజ్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ & మిల్క్ పథకాన్ని కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూకట్పల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మొయిజ్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన బ్రేక్‌ఫాస్ట్ & మిల్క్ పథకం ఒక దూరదృష్టి కలిగిన నిర్ణయమని ఆయన కొనియాడారు. ప్రతి విద్యార్థి పోషకాహారం పొందేలా ప్రభుత్వం కట్టుబడి ఉండటం అభినందనీయమని, విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేసే సంక్షేమ కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే విద్యలో రాణించగలరనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని వచ్చిందని ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహారంతో కూడిన అల్పాహారం మరియు పాలను అందిస్తున్నట్లు వారు తెలిపారు
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పోషకాహార లోపాలను తగ్గించడంతో పాటు, పాఠశాల హాజరు శాతం పెరగడం, చదువుపై మరింత ఆసక్తి పెరగడం, అలాగే వారి శారీరక మరియు మానసిక వికాసానికి తోడ్పాటు అందించబడుతుంది.
ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం మరియు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కు పాలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సలీం, ఆరిఫ్, రవి, అక్బర్, జోగా, తిరుపతి, జకీర్,మౌలానా తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article
1 Comment
  • We’re a gaggle of volunteers and starting a new scheme in our community.
    Your site provided us with useful information to work on. You have performed a formidable activity and our entire neighborhood will
    likely be thankful to you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *