జర్నలిస్టుల ప్రాణాలు కాపాడండి-మంత్రి దామోదరను కోరిన టీయుడబ్ల్యూజె

1 Min Read

సంగారెడ్డి:జులై9 రాయల్ పోస్ట్ న్యూస్ /
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యూజె) సంగారెడ్డి జిల్లా మహాసభ గురువారం నాడు విజయవంతంగా జరిగింది. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి దాదాపు 450మంది ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సభకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహా ముఖ్య అతిథిగా హాజరు కాగా, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్య పథకం లేక పదేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో దాదాపు 645మంది జర్నలిస్టులు అకాల మరణం చెందారని, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న క్యాష్ లేస్ హెల్త్ స్కీమ్ ను జర్నలిస్టులకు కూడా అమలు చేసి ఆరోగ్య భద్రతా కల్పించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ మంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలో యూనియన్ నాయకత్వంతో సమావేశమై, పథకం రూపకల్పన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజె ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఉపాధ్యక్షులు ఫైసల్ అహ్మద్, కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాదగిరి, విష్ణుప్రసాద్, మాజీ అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి, యూనియన్ సీనియర్ నాయకులు పానుగంటి కృష్ణ, సిద్దిపేట జిల్లా కార్యదర్శి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article