ఉత్తమ ప్రతిభావంతులను సన్మానించడం గొప్ప విషయం… జి జె సి. జనగాం గ్రూప్ టాపర్స్ కి సన్మానం

2 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ జనగాం జులై 17/తేది. 17-07-2026 శుక్రవారం రోజున స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ( ధర్మకంచ) జనగామ నందు 2026 ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రూప్ టాపర్స్ సన్మాన కార్యక్రమం లో క్యాష్ అవార్డు దాతలు వాసవి క్లబ్ గ్రేటర్ రఘునాథపల్లి మరియు వనిత క్లబ్ గ్రేటర్ రఘునాథపల్లి ప్రెసిడెంట్స్ కూరెల్లి ఉపేందర్ -రేణుక, సెక్రటరీ పజ్జురి రాజు, ట్రెజరరీస్ లాగిశెట్టి లింగయ్య – కూరెల్లి ఉష గారు వాసవి వనిత క్లబ్ రిజినల్ చైర్మన్ డాక్టర్ వరుధిని గారు మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజినల్ డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ఇరవై వేలు టాపర్స్ కి ప్రధానం చేయడం జరిగింది.

మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడానికి మనం చేయగలిగే ఉత్తమమైన పని మనల్ని మనం విద్యావంతులను చేసుకోవడం. విద్యార్థులు మంచి విద్య ను పొందితే సమాజం లో మంచి పౌరులు అవుతారు కాబట్టి మనం వారికి మంచి విద్యను అందించాలని కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అధ్యాపకులను కోరారు.

కస్టపడి చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచి, ఉత్తమ ఫలితాలు సాధించి, సమాజానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రపంచాన్ని మార్చగలరు. అలాంటి వారిని ప్రోత్సహించడం మరియు సన్మానించడం చాలా సంతోషకరం అని డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ అన్నారు.

గ్రూప్ టాపర్స్ వివరాలు:::

ఎస్. అజయ్ (ఎంపీసీ), షాజియా ఫాతిమా ( బైపిసి ఉర్దూ మీడియం ), కృష్ణవేణి (సి ఇ సి సెకండియర్), జె. అఖిల ( హెచ్ఈసి సెకండియర్), ఎం. శైనేశ్వరి ( ఎం పి హెచ్ డబ్ల్యు సెకండ్ ఇయర్ ), టి. లోకేష్ (ఎo ఎల్ టి .సెకండ్ ఇయర్), ఎం. బెంజమిన్ ( ఏ అండ్ టీ సెకండ్ ఇయర్ ), హరి కృష్ణ ( ఏ ఇ టి సెకండ్ ఇయర్ ), బి. సందీప్ ( ఓ ఏ సెకండ్ ఇయర్ ) మరియు ఫస్ట్ ఇయర్స్ లో ఎం డి. అబ్దుల్ సామీ, ఏ. వైష్ణవి, వై కావ్య, డి. అభిలాష్, సాన సుల్తానా, పి. దుర్గ ప్రసాద్, బి. కరణ్ కుమార్, ఏ. సిందూ లకు క్యాష్ ప్రైజ్ మరియు..సన్మానం పొందినారు

ఈ కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, కళాశాల ఎన్ ఎస్ ఎస్ పోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్, మరిపెల్ల రవిప్రసాద్, క్లబ్ మెంబెర్స్ తౌటుపల్లి లావణ్య, పడకంటి రవీందర్, గంగిశెట్టి అనూజ, కాపర్తి శ్రీనివాస్, అధ్యాపకుల బృందం, విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

📄 Generate e-Paper Clip
Share This Article