గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి…ఆర్‌డీఓకు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వినతి

1 Min Read
Oplus_16908288

గజ్వేల్, 23 జూన్ 2026 (రాయల్ పోస్ట్ న్యూస్ ):గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య డిమాండ్ చేసింది. మంగళవారం రోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో ఆందోళన చేపట్టారు. శ్రీ అంగడిపేట హనుమాన్ దేవాలయం నుంచి సంఘ సభ్యులు భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్‌డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం స్థానిక ఆర్‌డీఓకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టిలో మరే జంతువు కూ లేని విశిష్టత ఆవుకు ఉన్నాయని, ముక్కోటి దేవతలకు నిలయమైన గోమాతను సంరక్షించు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దేశపతి శంకర్ శర్మ, గౌరవ అధ్యక్షులు నాగేందర్ రావు, ఉపాధ్యక్షులు ఆర్.విశ్వేశ్వర్, విఠల మోహన్ శర్మ, గాడిచర్ల శరత్, వాసవాచార్యులు, సంఘం ప్రతినిధులు దివాకర్ శర్మ, రతన్ ప్రసాద్, శ్రీనివాస్ శర్మ, గంగాధర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *