రాజీవ్‌ ఆశయాలతో యువత ముందుకు సాగాలి…భువనగిరి పట్టణంలోని 23వ వార్డులో ఘనంగా రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి వేడుకలు..

Fasiuddin Mohammed
2 Min Read

18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం : బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 20/ పట్టణంలోని 23వ వార్డు ఇందిరానగర్‌లో భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌గాంధీ 82వ జయంతి వేడుకలను కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల అధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ ఘనంగా నిర్వహించారు. రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడుతూ దేశాభివృద్ధి, సాంకేతిక ప్రగతి, యువతకు అవకాశాల కల్పనలో రాజీవ్‌గాంధీ చేసిన కృషిని ఆయన గుర్తుచేశారు. అలాగే
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించేందుకు ఫారం-6 ఫారాన్ని అందించి, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అర్హులైన ప్రతి యువకుడు, యువతి ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, యువత తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. రాజీవ్‌గాంధీ కలలుగన్న ఆధునిక, ప్రగతిశీల భారత నిర్మాణానికి యువత శక్తి ప్రధాన బలమని బర్రె జహంగీర్ పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసి, రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. యువతను పెద్దఎత్తున కాంగ్రెస్‌ పార్టీ వైపు ఆకర్షిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు ఐలాపురం బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారు రవివర్ధన్, గాయాపాక పరమేశ్వర్, భూషపాక ఈశ్వర్ బాబు, బుచ్చాల అనిల్ కుమార్,బర్రె నరేందర్, గాయపాక వెంకటేష్, బర్రె క్రాంతి, బండారు అరుణ, నరాల లక్ష్మి, బర్రె సాయి, బర్రె బాబు బండారు శివ తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీ గారికి నివాళులర్పించి రాజీవ్ గాంధీ గారి ఆశయాలు సాధించుదామని ప్రతిజ్ఞ బోనారు.

📄 Generate e-Paper Clip
Share This Article