ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: బిజెపి డిమాండ్

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 20/
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం బీజేవైఎం ఆధ్వర్యంలో ఫీజు బకాయిలు, రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల చేతగాని పాలన వల్లే విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిందని తీవ్రంగా విమర్శించారు. ఎన్నో ఆశలతో చదువు కొనసాగిస్తున్న విద్యార్థుల జీవితాల్లో ఈ ప్రభుత్వాలు అంధకారాన్ని నింపుతున్నాయని ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దశలవారీగానైనా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని సూచించారు.

ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్, నాయకులు చందా మహేందర్ గుప్తా, మాయ దశరథ, సుర్వి శ్రీనివాస్ గౌడ్, రత్నపురం శ్రీశైలం, రత్నపురం బలరాం, ఆకుతోట రాజు, పరమేష్‌లతో పాటు బీజేవైఎం నాయకులు దయ్యాల కుమారస్వామి, భువనగిరి సిద్దు, గుర్రం ప్రవీణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు

📄 Generate e-Paper Clip
Share This Article