ఉప్పల్ నియోజకవర్గానికి బ్లడ్ బ్యాంక్, డయాగ్నస్టిక్ సెంటర్ మంజూరు చేయాలి..ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి

Fasiuddin Mohammed
2 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ ఉప్పల్ ఆగస్ట్ 18/

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌తో పాటు సమగ్ర డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహను కోరారు.

ఈ మేరకు ఎమ్మెల్యే మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం సమర్పించారు.

ఉప్పల్ నియోజకవర్గ జనాభా వేగంగా పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ మరియు పూర్తి స్థాయి ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్ అందుబాటులో లేవని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు CBC, బ్లడ్ షుగర్, LFT, KFT, USG తదితర ప్రాథమిక వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలను ఆశ్రయించడం ఆర్థిక భారంగా మారుతోందన్నారు.

నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, CHCలు, PHCల్లో సకాలంలో వైద్య సేవలు అందించేందుకు అవసరమైన డయాగ్నస్టిక్ సదుపాయాలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఉప్పల్ నియోజకవర్గంలో కాంపోనెంట్ సెపరేషన్ సదుపాయంతో కూడిన ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ మరియు పాథాలజీ, రేడియాలజీ, USG వంటి అవసరమైన సేవలతో కూడిన ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ రెండు సదుపాయాలు అందుబాటులోకి వస్తే ఉప్పల్ నియోజకవర్గంతో పాటు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, అత్యవసర వైద్య సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులను ఆదేశించి బ్లడ్ బ్యాంక్, డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు సాయి జెన్ శేఖర్ ,గంధం నాగేశ్వర్ రావు ,జేట్ట కిషోర్ కుమార్ BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article