తై బజార్ మాజీ కాంట్రాక్టర్ యాట కుమార్ పై పోలీసులకు పిర్యాదు…అక్రమంగా తై బజార్ శిస్తు వసూలు చేసినట్లు ఆరోపణలు

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 9/ భువనగిరి మున్సిపాలిటీ
తై బజార్ మాజీ కాంట్రాక్టర్ భువనగిరి పట్టణానికి చెందిన యాట కుమార్, తానే అసలు కాంట్రాక్టర్ నని వ్యాపారుల వద్ద అక్రమంగా శిస్తు వసూలు చేసినట్ట్లు అతని పై భువనగిరి పట్టణ పోలీసులకు పిర్యాదు చేసినట్లు ప్రస్తుత
తై బజార్ కాంట్రాక్టర్ పుట్ట శివ కుమార్ ఆదివారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా పుట్ట శివకుమార్ మాట్లాడుతూ గతంలో తక్కువ ధరకు వేలం పాట పాడి, మున్సిపల్ ఆదాయానికి నష్టం కల్గించిన యాట కుమార్ అనే వ్యక్తి, తానే అసలు కాంట్రాక్టర్ నని వ్యాపారుల నుంచి అక్రమంగా తై బజార్ శిస్తు వసూలు చేయుచుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు శివకుమార్ విలేకరులకు తెలిపారు.
ఈ సంవత్సరం లో తై బజార్ వేలం పాట దక్కలేదని కోపంతో, గత కొంత కాలంగా తనని వేదిస్తున్నట్లు, రౌడీలతో బెదిరించినట్లు శివకుమార్ తెలిపారు. చట్ట విరుద్ధంగా అక్రమ వసూళ్లకు పాల్పడిన యాట కుమార్ పై తగిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని, తనకు రక్షణ కల్పించాలని శివకుమార్ పోలీసులకు, మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

📄 Generate e-Paper Clip
Share This Article