భువనగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ‘చేయూత’ పింఛన్లపై ప్రత్యేక కౌన్సిల్ సమావేశం..అర్హులైన ప్రతి ఒక్కరికీ ‘చేయూత’ పింఛన్ అందాలి: మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి,..అర్హులైన వారి నుండి కొత్త దరఖాస్తులు స్వీకరించండి: భువనగిరి పురపాలక ప్రత్యేక సమావేశంలో నిర్ణయం

Fasiuddin Mohammed
1 Min Read

భువనగిరి, ఆగస్టు 13 రాయల్ పోస్ట్ న్యూస్ /

పేద ప్రజలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచే ‘చేయూత’ పింఛన్ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా అందాలని భువనగిరి పురపాలక సంఘం చైర్ పర్సన్ శ్రీమతి తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ తెలిపారు. గురువారం ఉదయం 11:00 గంటలకు భువనగిరి పురపాలక సంఘం కార్యాలయంలో చైర్ పర్సన్ అధ్యక్షతన చేయూత పింఛన్లపై ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. వార్డుల వారీగా అర్హులైన లబ్ధిదారుల జాబితాను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. నూతన దరఖాస్తులను స్వీకరించి, అర్హత ఉన్న వారందరికీ పింఛన్లు మంజూరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులను ఎప్పటికప్పుడు తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ మార్గదర్శకాలు – నిర్దేశిత వర్గాలకే దరఖాస్తులు:

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు, నిబంధనలను గౌరవ సభ్యులకు వివరించారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం కేవలం క్రింది పేర్కొన్న విభాగాలకు చెందిన వారు మాత్రమే నూతన దరఖాస్తులను సమర్పించాలని తెలియజేశారు:

  1. ఒంటరి మహిళలు (Single Women)
  2. (Widows)
  3. గీత కార్మికులు (Toddy Tappers)
  4. చేనేత కార్మికులు (Weavers)
  5. ఫైలేరియా బాధితులు (Filaria)
  6. డయాలసిస్ బాధితులు (Dialysis – Saturation basis)
  7. రక్త సంబంధిత వైకల్యాలు (తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హిమోఫీలియా) కలిగిన దివ్యాంగులు (Disabled Pensions – Saturation basis)

పింఛన్ల పంపిణీ, అర్హుల ఎంపిక ప్రక్రియపై కౌన్సిల్ సభ్యుల నుండి పలు సూచనలు, సలహాలను స్వీకరించారు.

ఈ ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, కమీషనర్ కె. చంద్రప్రకాష్ రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు మరియు సంబంధిత పురపాలక అధికారులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article