రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 7/
యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం హనుమాపురం గ్రామంలో మేఘన హాస్పిటల్ భువనగిరి వారి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు
గ్రామ సర్పంచ్ నాగపురి సువర్ణ కృష్ణ సహకారం తో , మేఘన హాస్పిటల్ చెందిన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ సి. శ్రావ్య భావన (MBBS, MS-OBG, మేఘన హాస్పిటల్ భువనగిరి ) డాక్టర్ కె. సుప్రజ బాయ్ DMO( PHARM-D ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హన్మాపురం గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వైద్య సేవలను విశేషంగా వినియోగించుకున్నారు.
- విస్తృత వైద్య సేవలు: గ్రామీణ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
- ఆరోగ్య అవగాహన: స్త్రీల ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పోషకాహారం ప్రాముఖ్యతపై డాక్టర్ శ్రావ్య భావన ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించారు.
- నాయకుల ప్రశంసలు: మేఘన హాస్పిటల్ ఉ చిత వైద్య శిబిరాన్ని నిర్వహించి గ్రామస్థుల ఆరోగ్య భద్రతకు కృషి చేసిన సర్పంచ్ నాగపురి సువర్ణ కృష్ణను, మేఘన హాస్పిటల్ వైద్య బృందాన్ని స్థానికులు మరియు గ్రామ పెద్దలు అభినందించారు.
ఈ కార్యక్రమంలో మేఘన హాస్పిటల్ ఎం డి రామ్ రెడ్డి గ్రామ సర్పంచ్ సువర్ణ కృష్ణ మేఘన హాస్పిటల్ వైద్య సిబ్బంది, గ్రామ వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని జయప్రదం చేశారు.



