యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

Fasiuddin Mohammed
1 Min Read

భువనగిరి రాయల్ పోస్ట్ ప్రతినిధి ఎం డి ఫసియుద్దీన్ ఆగస్ట్ 6/
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ అవైస్ ఉర్ రహమాన్ చిస్తీ జయశంకర్ సర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవైస్ ఉర్ రహమాన్ చిస్తీ మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా, భావజాల వ్యాప్తికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. నేటి యువత, విద్యార్థులు జయశంకర్ సర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, విద్యార్థులు పాల్గొని జయశంకర్ సార్‌కు ఘన నివాళులర్పించారు.

📄 Generate e-Paper Clip
Share This Article