గజ్వేల్, 05 ఆగస్టు 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ముట్రాజ్ పల్లి రోడ్డు లో మహతి ఆడిటోరియం పక్కన కోలా అభిరామ్ ఫంక్షన్ హాల్ లో బుధవారం ‘శుభవర ఎగ్జిబిషన్ అండ్ సేల్’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్థానిక ప్రముఖులు మరియు నిర్వాహకుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రదర్శనను అధికారికంగా ప్రారంభించారు. రాబోయే పండుగలు, శుభకార్యాలను దృష్టిలో ఉంచుకుని, కుటుంబం మొత్తానికి కావలసిన సరికొత్త ఫ్యాషన్ కలెక్షన్స్ ఈ ఎగ్బిషన్‌లో అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కాంచీపురం పట్టు, బనారస్, గద్వాల్, ఇక్కత్, ఫ్యాన్సీ చీరలు మరియు డిజైనర్ డ్రెస్ మెటీరియల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫ్యామిలీ ఫ్యాషన్ పురుషుల కొరకు ట్రెండీ షర్ట్స్, జీన్స్, కుర్తాలు మరియు పిల్లల కోసం సరికొత్త కిడ్స్ వేర్ కలెక్షన్స్ కలవు. కస్టమర్ల బడ్జెట్‌కు అనుగుణంగా ఆషాఢం,శ్రావణ మాస ప్రత్యేక ఆఫర్లు మరియు భారీ డిస్కౌంట్ తో అమ్మకాలు జరుగుతున్నాయి. వస్త్రాలతో పాటు ఫ్యాషన్ యాక్సెసరీస్, జ్యువెలరీ మరియు హ్యాండ్ క్రాఫ్ట్ స్టాళ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శుభవర యజమాని గాంధీ సూర్యకాంత్ మాట్లాడుతూ “నాణ్యమైన వస్త్రాలను, సరికొత్త డిజైన్లను నేరుగా హోల్‌సేల్ ధరలకే గజ్వేల్ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ ‘శుభవర ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని కోరారు. నేటి నుండి ఈ నెల 13 వరకు మాత్రమే ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు.
