భువనగిరిలో క్షేత్రస్థాయిలో పర్యటించిన చైర్‌పర్సన్ శ్రీమతి తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్.. వర్షపు నీరు నిలవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం

భువనగిరి జులై 29 రాయల్ పోస్ట్ న్యూస్ /

నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో భువనగిరి పట్టణంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ పలు ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. పట్టణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మున్సిపల్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

ఈ పర్యటనలో భాగంగా ఆమె స్థానిక జాంఖాన గూడ చౌరస్తా వద్దకు చేరుకుని, అక్కడ మురికి కాలువల్లో పేరుకుపోయిన పూడిక మరియు మట్టి కుప్పలను జెసిబి (JCB) సహాయంతో వెంటనే తొలగించి శుభ్రం చేయించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, పట్టణంలో ఎక్కడా కూడా వర్షం నీరు నిలవకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

📄 Generate e-Paper Clip
Share This Article