బస్వాపురం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసి ప్రాజెక్టు పరిధిలోని చెరువులను నింపి రైతాంగానికి సాగునీరు అందించాలని– నిర్వాసితులకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించి, ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలి — సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 19/బస్వాపురం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసి ప్రాజెక్టు పరిధిలోని చెరువులను నింపి రైతాంగానికి సాగునీరు అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి. జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించి, ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని అన్నారు.
ఆదివారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బస్వాపురం ప్రాజెక్టులోనీ నీటిని పరిశీలన చేసిన అనంతరం ప్రాజెక్టు కట్టపైన ఉన్న గేట్ల దగ్గర నీటిని విడుదల చేయాలని ” ధర్నా ” కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం జహంగీర్ మాట్లాడుతూ జిల్లా అత్యంత కీలకంగా రైతాంగానికి ఉపయోగపడే బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రాజెక్టులో నిలువ ఉన్న 0.6 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేయడం వల్ల జిల్లా పరిధిలోని ఐదారు మండలాల్లోని చెరువులు నింపితే రైతాంగానికి ఈ వర్షా బావ పరిస్థితులలో సాగుకు ప్రధానంగా ఉపయోగపడుతుందని తెలిపారు. స్థానిక చెరువులు, కుంటలు

నింపడం వల్ల భూగర్భ జలమట్టం పెరిగి బోర్లలో, బావుల్లో కూడా నీళ్లు వస్తాయని దీనివల్ల సాగు, త్రాగు నీటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని తెలియజేశారు. ప్రాజెక్టులో నీళ్లు ఉన్న వాటిని విడుదల చేసి రైతాంగానికి అందించడం స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, నీటి పారుదల శాఖ జిల్లా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నుండే బస్వాపురం ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో, నిధులు కేటాయించడంలో వివక్షత చూపుతోందని విమర్శించారు. వర్షాభావ పరిస్థితులలో నార్లు పోసి నీళ్లు లేక ఎదురుచూస్తున్న రైతాంగానికి ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేసి అందించడంలో కూడా సవితి తల్లి ప్రేమ ప్రభుత్వము చూపిస్తుందని ఎద్దేవ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి నీటిని విడుదల చేయాలని లేకపోతే రైతులను, ప్రజలను సమీకరించి కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని జహంగీర్ హెచ్చరిక చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ, బట్టుపల్లి అనురాధ, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ , భువనగిరి మండల పార్టీ కార్యదర్శి పల్లెర్ల అంజయ్య , ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ , కొండ అశోక్శ , భువనగిరి పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు గంధమల్ల మాతయ్య , మండల కమిటీ సభ్యులు మోటె ఎల్లయ్య , కళ్లెం లక్ష్మి నరసయ్య, టౌన్ కమిటీ సభ్యులు బర్ల వెంకటేష్ , మండల పరిషత్ మాజీ కో- ఆప్షన్ యండి బాబు, బస్వాపురం మాజీ శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య , శాఖ సహాయ కార్యదర్శి రాసాల దెవెందర్, నమాత్ పల్లి శాఖ కార్యదర్శి జిట్ట అంజిరెడ్డి , సీపీఎం సభ్యులు, రైతులు బండి శ్రీను, తెల్జూరి మాణిక్యం, గోదల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article