రాయల్ పోస్ట్ వికారాబాద్ జిల్లా స్టాపర్ జులై 12
చెన్నైలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్–2026 (Soke Anandan Cup–2026) పోటీల్లో వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చి ట్రోఫీలు సాధించారు. ఈ పోటీలను Okinawa Gojurya Karate Do Federation India & Malaysia ఆధ్వర్యంలో, World Karate Confederation (WKC/FW) అనుబంధంతో ఘనంగా నిర్వహించారు.
ఈ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశంలోని 10కుపైగా రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొనగా, మలేషియాతో పాటు మరో నాలుగు దేశాలకు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి SSKI (Success Shotokan Karate India) జట్టు పాల్గొని విశేష ప్రతిభ కనబరిచింది. ఇందులో వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలానికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకున్నారు.
చిట్టిగిద్ద గ్రామానికి చెందిన బి. సిద్ధీక్ష కటా విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ట్రోఫీని అందుకుంది. అదే గ్రామానికి చెందిన ఎం. శివసాయి 15 ఏళ్ల బాలుర కటా విభాగంలో ప్రథమ స్థానం సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. అలాగే పులుమామిడి గ్రామానికి చెందిన జె. మనీష్ గౌడ్ కుమిటే విభాగంలో ప్రతిభ కనబర్చి ట్రోఫీని గెలుచుకున్నాడు.
విద్యార్థుల ఈ విజయంపై మాస్టర్ మహేష్ మరియు గ్రాండ్ మాస్టర్ అనిల్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ విజేతలను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
