రాయల్ పోస్ట్ న్యూస్ హనుమకొండ, జూలై 13

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై అయినవోలు మండలంలోని పంతిని, పున్నెల్,
ఐనవోలు గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఓటర్లకు ఎస్‌ఐఆర్‌లో ఉపయోగించే వివిధ దరఖాస్తు ఫారాలు, నమోదు ప్రక్రియ, అర్హతలు, సవరణలు, ఓటరు జాబితాలో వ్యక్తిగత వివరాల నవీకరణ తదితర అంశాలపై ఎమ్మార్వో విక్రం సమగ్రంగా వివరించారు. ఓటర్ల నుంచి స్వీకరించిన ఎస్‌ఐఆర్ దరఖాస్తు ఫారాలను నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా తిరిగి సమర్పించాలని ఆయన సూచించారు. ఫారాల పూరణలో ఎలాంటి సందేహాలు లేదా ఇబ్బందులు ఎదురైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంబంధిత బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలు పూర్తి సహకారం అందించి ఫారాలను సక్రమంగా నింపేందుకు సహాయం చేస్తారని తెలిపారు. ప్రతి అర్హుడైన ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను సరిచూసుకుని, అవసరమైన దరఖాస్తులను సమర్పించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ప్రతి అర్హ ఓటరు సద్వినియోగం చేసుకోవాలని ఐనవోలు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నకరకంటి మోహన్ గౌడ్ పిలుపునిచ్చారు. ఐనవోలు మండలంలోని పంతిని, పున్నెల్, అయినవోలు గ్రామాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. ఓటరు వివరాలను సకాలంలో సరిచేసుకొని, అవసరమైన ఫారాలను గడువులోపు సమర్పించడం ద్వారా ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి సుధీర్ గౌడ్, రఘు, అయినవోలు 170వ బూత్ బీఎల్‌ఏ తాటికాయల ప్రశాంత్, పున్నెల్ బీఎల్‌ఏ ఎడ్ల జగన్ తదితరులు పాల్గొన్నారు.