చిన్న వర్షానికే నీట మునుగుతున్న ప్రధాన రహదారి..

1 Min Read

  • ప్రయాణికుల నరకయాతన
  • గజ్వేల్ మున్సిపల్ ఆఫీస్ నుండి ముట్రాజ్‌పల్లి వెళ్లే రహదారిపై నిలిచిన నీరు
  • చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారుల డిమాండ్

గజ్వేల్, 26 జూలై 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అత్యంత కీలకమైన ప్రధాన రహదారిపై డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా నీరు రోడ్డుపైనే నిలిచిపోతోంది. ముఖ్యంగా గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం నుండి ముట్రాజ్‌పల్లి వైపు వెళ్లే మార్గంలో, కోలా అభిరామ్ గార్డెన్ ముందర నుండి సిద్ధార్థ్ సూపర్ మార్కెట్ వరకు రోడ్డు సగం భాగం పూర్తిగా నీటిమయంగా మారుతోంది. దీనివల్ల నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, కాలినడకన వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రోడ్డులో సగభాగం చెరువును తలపిస్తోంది. రోడ్డుపై మురుగునీరు, వర్షపు నీరు నిలిచిపోవడంతో దుకాణదారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి కోలా అభిరామ్ గార్డెన్ నుండి సిద్ధార్థ్ సూపర్ మార్కెట్ వరకు సరైన కల్వర్టులు, డ్రైనేజీ కాలువలు నిర్మించి, నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article