లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యుల ప్రమాణ స్వీకారం….గైర్ హాజరైన ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు, ఇంచార్జ్ మంత్రి…హైకోర్టుకు ఆశ్రయించనున్న అనువంశిక మాజీ చైర్మన్

Fasiuddin Mohammed
2 Min Read

రాయల్ పోస్ట్ : యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి / యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డు) ప్రమాణ స్వీకారం వైభవంగా శనివారం ముగిసింది.
ఆలయ చరిత్రలో దాదాపు 17 ఏళ్ల తర్వాత కొత్త పాలకమండలి ఏర్పాటు కాగా, అనువంశిక ధర్మకర్త కాకుండా ఇతరులు పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి.
ఆలయ ఈఓ భవానీ శంకర్ సమక్షంలో చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డితో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం: ప్రధానాలయంలోని బంగారు వాకిలి వద్ద ఉదయం 11:37 నిమిషాలకు ముఖమండపంలో ఈ వేడుక నిర్వహించబడింది.
ప్రధాన సభ్యులు: ఎంఎస్‌ఎన్ గ్రూప్ చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి (ఛైర్మన్),
ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి,
మంత్రి కొణిదెల సురేఖ తదితరులు ప్రమాణం చేశారు.
ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాధారణ భక్తుల దర్శనాలను ఆలయ అధికారులు నిలిపివేశారు.
ప్రమాణ స్వీకారం అనంతరం కొండపై ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నూతన పాలకవర్గం తమ తొలి అధికారిక సమావేశాన్ని నిర్వహించింది.
గత నెలలో తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌, సభ్యులను నియమించిన విషయం తెలిసిందే. శనివారం బోర్డు ప్రమాణ స్వీకారం ఉండగా సభ్యుడు నరసింహమూర్తి గైర్హాజరయ్యారు.
యాదగిరిగుట్ట ట్రస్ట్‌ బోర్డు ప్రమాణ స్వీకారానికి సభ్యుడు గైర్హాజరు పై పలువురు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు.
గతంలో లక్ష్మీ నరసింహ స్వామి ట్రస్ట్‌ బోర్డులో అనువంశిక ధర్మకర్తకే చైర్మన్‌ పదవిని కట్టబెట్టడం ఆనవాయితీగా జరిగేది.
ఈ ఆనవాయితీకి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వేరేవారికి చైర్మన్‌ పదవి ఇవ్వడంతో ఆయన కినుక వహించినట్టు తెలిసింది.
దీంతో ఈ విషయంపై ఆయన న్యాయపోరాటానికి హైకోర్టును ఆశ్రయించినట్టు విశ్వసనీయ సమాచారం.
ప్రథమ సమావేశానికి దుమ్ము కొట్టిన ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు.
17 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార ఉత్సవానికి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరుశాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరై హాజరు కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన
ఇద్దరు క్యాబినెట్ మంత్రులు, ఇంచార్జ్ మంత్రి గైర్హాజర్ పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులే గాక వివిధ వర్గాలు చెందిన వారు, ఆధ్యాత్మికవేత్తలు నిరసన తెలుపుతున్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article