బీసీ 7 న్యూస్, టీవీ 7 టీ న్యూస్ చానల్స్ ప్రారంభం

1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ జులై 10/ హైదరాబాద్, జూలై 10: బీసీ రిజర్వేషన్లపై అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని వివిధ పార్టీల,
ప్రజా సంఘాల, బీసీ సంఘాల బీసీ నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నారాయణగూడలో బీసీ 7 న్యూస్, టీవీ 7 టీ న్యూస్ చానల్స్ ను పలువురు ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చానల్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వి. హనుమంతరావు, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి తంగెళ్లమూడి నందగోపాల్, విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ, ఉదయ్ నేత, శివమ్మ, తారకేశ్వరి, రూప, శివకుమార్, ఆంజనేయులు, వేణు, గోవింద్ తదితరులు ప్రసంగించారు. దేశ జనాభాలో 56శాతం బీసీలు ఉన్నప్పటికి సరైన న్యాయం జరగడం లేదని వారు అన్నారు. 78 సంవత్సరాలుగా బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతూనే ఉందని పేర్కొన్నారు. బీసీలందరూ సంఘటితంగా ఉద్యమించి బీసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏకులానికి, మతానికి లేని ఆంక్షలు కేవలం బీసీలకు మాత్రమే ఎందుకు ఉన్నాయని వారు ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం… బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

📄 Generate e-Paper Clip
Share This Article