చదువుతోనే సమాజంలో మార్పు…..ఘనంగా ఆర్ బీవీఆర్ఆర్ మహిళా కళాశాల స్నాతకోత్సవ వేడుకలుమల్కాజిగిరి పోలీస్ కమీషనర్ బి. సుమతి ఐపిఎస్

1 Min Read

హైదరాబాద్ రాయల్ పోస్ట్ న్యూస్ , జూలై 10: చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని మల్కాజిగిరి పోలీస్ కమీషనర్ బి.సుమతి ఐపిఎస్ అన్నారు. రాజ బహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాల 15వ స్నాతకోత్సవ వేడుకలు శుక్రవారం నారాయణగూడ లోని కళాశాల అడిటోరియంలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ జె. అచ్యుత దేవి అధ్యక్షత వహించారు. ఈ వేడుకలకు సుమతి ఐపిఎస్ ముఖ్యఅతిధిగా పాల్గొని 2024 -25 విద్యా సంవత్సరానికి చెందిన 302 మంది విద్యార్థినులకు డిగ్రీ పట్టాలను ప్రధానం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థినిగా ప్రారంభమైన తన ప్రయాణం నగర పోలీస్ కమీషనర్ స్థాయికి ఎలా చేరుకుందో వివరిస్తూ విద్యార్థినులకు స్పూర్తినిచ్చారు. నాయకత్వ లక్షణాలు, కరుణ, ప్రజలతో అనుబంధం, సేవాభావం వంటి విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు. మహిళా విద్యాభివృద్ధికి ఆర్ బీవీఆర్ఆర్ మహిళా కళాశాల అందిస్తున్న విశిష్ట సేవలను ఆమె ప్రశంసించారు. హ్యుమానిటీస్, సైన్సెస్, కంప్యూటర్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బంగారు పతకాలు, ప్రతిభా పురస్కారాలు ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఓయు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.శశికాంత్, హైదరాబాద్ మహిళా విద్యా సంఘం కార్యదర్శి ప్రొఫెసర్ కె. ముత్యంరెడ్డి, సెక్రెటరీ కమ్ కరస్పాండెంట్ ప్రొఫెసర్ కె.సుదర్శన్ రెడ్డి, కళాశాల పరీక్షల నియంత్రణాధికారి బి. మంజుల, డాక్టర్ ఎం. సుచిత్ర, డాక్టర్ కె.స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article