రైతులపై అన్యాయం తక్షణమే ఆపాలి….ఏనుగు సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

Fasiuddin Mohammed
2 Min Read

రైతులపై అన్యాయం తక్షణమే ఆపాలి — ఏనుగు సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

  • రైతుల నుండి క్వింటాకు రూ.50 వసూలుపై తీవ్ర ఆగ్రహం
  • బస్తాకు 2 కిలోలు + రైస్ మిల్లు వద్ద 2 కిలోల కోతపై ఆందోళన
  • రైతులకు భారీ నష్టం కలిగిస్తున్న అక్రమ కోతలు
  • 50 రోజులుగా వరి కోసి దాన్యం కల్లాల వద్ద పోసి ఎదురుచూస్తున్నారు
  • కొంతమంది రైతులు ఏమి చేయలేక దళారులకు 1500 రూపాయలకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది

రాయల్ పోస్ట్ న్యూస్ ఘట్కేసర్ మే 27/ మున్సిపల్ కార్పొరేషన్ ఏదులాబాద్ డివిజన్ పరిధిలోని వడ్లు కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో నేరుగా మాట్లాడి కొనుగోలు కేంద్రంలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. వర్షాకాలం కారణంగా ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్ద అవుతుండటం చాలా దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ధాన్యాన్ని తరలించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు

రైతుల నుండి క్వింటాకు రూ.50 వరకు అన్యాయంగా వసూలు చేయడం తీవ్రంగా ఖండనీయమని అన్నారు. అంతేకాకుండా 40 కిలోల బస్తాకు ఇక్కడ 2 కిలోలు, రైస్ మిల్లు వద్ద మరో 2 కిలోలు కోత విధించడం రైతుకు భారీ నష్టం కలిగించే దుర్మార్గపు చర్య అని ఆయన మండిపడ్డారు

ఇలాంటి అక్రమ కోతలు రైతుల జీవనాధారంపై నేరుగా ప్రభావం చూపుతున్నాయని, ప్రభుత్వం వెంటనే దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు న్యాయం జరగకపోవడం అత్యంత బాధాకరమని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత తీసుకురావాలని ఆయన కోరారు.

ఇప్పటికీ రైతులు 50 రోజులుగా వరికొసి ధాన్యం కలాల వద్ద పొసి ఎదురుచూస్తున్నారు కానీ కొంతమంది రైతులు ఏమి చేయలేక దళారులకు 1500 రూపాయల కూడా అమ్ముకుంటున్నారు

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం వెంటనే తరలించి చెల్లింపులు వేగంగా చేయాలని అధికారులను హెచ్చరించారు. రైతు సంక్షేమం మాటల్లో కాకుండా చేతల్లో చూపాలని ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కప్పర్గల కరుణాకర్, మాజీ సర్పంచ్ బట్టే శంకర్, సొసైటీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ ధర్మారెడ్డి, బిజెపి ఘట్కేసర్ మండల్ మాజీ ప్రధాన కార్యదర్శి రాచకట్ల శ్రీశైలం, సంకు మల్లేష్, గట్టుపల్లి మల్లేష్ ముదిరాజ్, పూస వెంకటేష్, ఎర్రోళ్ల మురళి, తోటకూరి శ్రీను, బద్దం నాగరాజు, గట్టుపల్లి అనిల్, మహేష్, సాల్వేర్ పాండు, గట్టుపల్లి రవి, సాయి తదితరులు పాల్గొన్నారు

📄 Generate e-Paper Clip
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *