royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaఆషాఢ బోనాల వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 4:22 pm
Date of Publish : 10 Aug 2026, 6:05 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 10 💬 0
Latest News

ఆషాఢ బోనాల వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్..

ఆషాఢ బోనాల వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్..

రాయల్ పోస్ట్ న్యూస్ ఘట్కేసర్ ఆగస్ట్ 9/ మేడ్చల్–మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ కీసర,దమ్మైగూడ డివిజన్లలో ఆషాఢ బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రెష్ యాదవ్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.