royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaకాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని : బర్రె జహంగీర్… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 2:37 pm
Date of Publish : 03 Jul 2026, 7:47 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 7 💬 0
Latest News

కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని : బర్రె జహంగీర్…

కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని : బర్రె జహంగీర్…

కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని : బర్రె జహంగీర్

ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా SIR ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పర్యవేక్షించిన మాజీ మున్సిపల్ చైర్మన్

23వ వార్డు బూత్ నెం.86, 89ల్లో ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాల నింపి ప్రజలకు అందుబాటులోకి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్


రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 2/ : భువనగిరి 94 అసెంబ్లీ నియోజకవర్గంలోని 23వ వార్డు బూత్ నెం.86, 89ల పరిధిలో చేపట్టిన SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటరు జాబితా సవరణ ప్రక్రియను మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ స్వయంగా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) అనిల్ నాయక్, ఆర్‌పీ మంజులతో కలిసి గల్లీ గల్లీ తిరుగుతూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్యుమరేషన్ ఫారాలను స్వయంగా నింపించి, అవసరమైన సూచనలు చేశారు. ఓటర్ల పేర్లు సక్రమంగా నమోదవుతున్నాయా, ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా బర్రె జహంగీర్ మాట్లాడుతూ, 2002 నాటి ఓటరు జాబితాలో "బ్లడ్ రిలేషన్" ఆప్షన్‌ను ప్రాతిపదికగా తీసుకుని కొంతమంది ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపుకు గురికాకుండా పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటరికి సహకరించాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.