నిధుల సాధనకై, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికై రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు ఏకమై కదులుదాం– జిల్లాలో ఉన్న నీటి సమస్య పరిష్కారంకై ఈనెల 31న నిర్వహిస్తున్న మహాధర్నకు వేలాదిగా తరలి రండి– సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపు

Fasiuddin Mohammed
2 Min Read


రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 23/ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, కాల్వలు పూర్తి కోసం ప్రభుత్వం నుండి నిధుల సాధనకై రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు ఏకమై ఈనెల 29, 30, 31 తేదీలలో భువనగిరి నుండి హైదరాబాద్ వరకు సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రలో అడుగులో అడుగు వేసి ఏకమై కదులుదామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో పాదయాత్రను, మహాధర్నాను జయప్రదం చేయాలని గోడపత్రిక (వాల్ పోస్టర్స్) ను సీపీఎం నాయకులతో రైతులతో కలిపి నర్సింహ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ బస్వాపురం రిజర్వాయర్ నిర్వసితులకు వెంటనే పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించి ప్రాజెక్టు పెండింగ్ పనులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గంధమల్లా రిజర్వాయర్ పనులకు నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని, శివన్నగూడెం (చర్లగూడెం) రిజర్వాయర్ భూసేకరణ పూర్తి చేసి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, శివన్నగూడెం రిజర్వాయర్ నుండి రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనకు ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తూ నిధులు విడుదల చేయాలని అన్నారు. బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాల్వలకు నిధుల కొరత నివారించి నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. మూసీ ప్రక్షాళన, గోదావరి జలాల అనుసంధానంకై జిల్లా డిపిఆర్ ప్రకటించి నిధులు విడుదల చేయాలని కోరారు. ఆలేరు, గుండాల ప్రాంతానికి నీరందించే అశ్వరాయపల్లి, నవాబుపేట రిజర్వాయర్ పరిధిలో ఆటంకాలను తొలగించి తక్షణం నీరందించాలని ప్రభుత్వాన్నికి సూచించారు. పురాతనమైన ఆసిఫ్ నహర్, బృందావన్ కాల్వలు పునరుద్ధరించేందుకు తగిన నిధులు విడుదల చేయాలని సూచించారు. శామీర్ పేట చెర్వును రిజర్వాయర్ చేస్తూ గోదావరి జలాలను మల్లించడం ద్వారా ద్వారా బొమ్మలరామారాం, భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి మండలాలకు సాగు, త్రాగు నీరందించాలని, మూసీ జల కాలుష్యం నుండి ప్రజల ప్రాణాలు కాపాడాలని అందుకు తగిన ప్రణాళిక రూపొందించి నిధులు విడుదల చేయాలని కోరారు. వడపర్తి కత్వలోకి నీరందించే బస్వాపూర్ రిజర్వాయర్ కాల్వ పనులు వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నర్సింహ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న పాదయాత్రలో, మహాధర్నాలు అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏదునూరి మల్లేశం, సిపిఎం గ్రామ కమిటి కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్ , గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్ , సిపిఎం గ్రామ నాయకులు , రైతులు పిట్టల వెంకటేష్ , బొల్లెపల్లి కిషన్ , పరమేష్ , ప్రవీణ్ , గంగదారి భాను , గణేష్ , వరి కొప్పుల రమేష్ , గునుగుంట్ల బాలయ్య , గురుజాల రమేష్ , శ్రీరాం వీరయ్య , మహేందరు , సత్తయ్య , నరేష్ , మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article