రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 3/ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మంగ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఐకమత్య భావం పెంపొందించడంలో ఇటువంటి క్రీడా పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మంగ ప్రవీణ్ మాట్లాడుతూ, యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చి క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొంటున్న అన్ని జట్లు క్రీడాస్ఫూర్తితో ఆడి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ అవైస్ చిస్తీ, బర్రె జహంగీర్ పోలిశెట్టి అనిల్ అంగడి నాగరాజు జహంగీర్ సోమయ్య కొల్లూరి రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, క్రీడాకారులు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

