ఎన్యుమరేషన్ ఫారాల గడువు పొడిగించాలి – బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 11/
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు విధించిన గడువును వెంటనే పొడిగించాలని బర్రె జహంగీర్ భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ డిమాండ్ చేశారు.
ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ఓటరు జాబితా ప్రక్షాళనే ప్రధాన లక్ష్యమని ప్రకటించిన నేపథ్యంలో, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు జూలై 24 వరకు మాత్రమే గడువు ఉండగా, జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారని ఆయన పేర్కొన్నారు.
అయితే, ప్రక్రియ ప్రారంభమై 15 రోజులు గడిచినా సాంకేతిక సమస్యలు, ముఖ్యంగా సర్వర్ తరచూ డౌన్ అవుతుండటంతో డిజిటలైజేషన్ కేవలం 17 శాతం మాత్రమే పూర్తైందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మిగిలిన కొద్ది రోజుల్లోనే 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం అధికారులు, బూత్ స్థాయి సిబ్బంది, ఓటర్లకు కత్తిమీద సాములా మారిందని అన్నారు.
ప్రజలు తమ వివరాలను సరిచేసుకునేందుకు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు తగినంత సమయం అవసరమని బర్రె జహంగీర్ పేర్కొన్నారు. తొందరపాటుతో ప్రక్రియ ముగిస్తే అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తప్పిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ఎన్నికల సంఘం గడువును పొడిగించి ప్రజలకు, ఎన్యుమునేషన్ చేసే సిబ్బందికి తగిన అవకాశం కల్పించాలని బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట BLO రాచమళ్ళ సరోజన, షేక్ మజార్( బబ్లూ), ఎండి బురానుద్దీన్ కౌన్సిలర్, సుజాయత్ అలీ కౌసర్ కోఆప్షన్ సభ్యులు, బెండే లాల్ రాజ్, తోట కార్తీక్, బత్తుల బాబు, ఎడబోయిన శ్రీనివాస్, ఎడబోయిన కిషన్ లతో ఓటర్ల ఫారాలను నింపి ఓటర్లు త్వరితగతన ఎమునరేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు.

📄 Generate e-Paper Clip
Share This Article