గజ్వేల్, 28 జూన్ 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గుంటుకు లక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ గుంటుకు లక్ష్మి శ్రీనివాస్ చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కౌన్సిలర్ లక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని, సమాజాన్ని పోలియో రహితంగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇటువంటి ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వార్డు పరిధిలో ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు అందే విధంగా వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ పెద్దలు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, తల్లులు తమ పిల్లలతో కలిసి పాల్గొన్నారు.
