వేసవిలో మూగజీవాల కష్టాలు…!జీవాలను పట్టించుకునే నాధుడే లేడు……. ఎండ దెబ్బకు మనుషులే అల్లాడుతుండ్రు.. జీవాల పరిస్థితి ఏంటి….

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ యాదాద్రి భువనగిరి మే 22 /ప్రభుత్వం మూగజీవు లకు ఒక లక్ష్యంతో పథకాలను ప్రవేశ పెడితే, క్షేత్రస్థాయిలో దానిని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ఆ ఆశయానికి తూట్లు పొడుస్తుంది. వేసవి తీవ్రత దృష్ట్యా అడవిలోని , గ్రామాల సమీపంలోని మూగ జీవాల దాహార్తి తీర్చడానికి ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు నేడు నిరుప యోగంగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న గ్రామ పరిసర ప్రాంతాల్లో పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటి కొళాయిల పరిస్థితి ప్రస్తుతం అత్యంత అధ్వానంగా మారింది. లక్షల రూపాయల వ్యయంతో వీటిని నిర్మించినప్పటికీ , నిర్వహణను గాలికొది లేయడంతో ఇవి కేవలం సిమెంట్ కట్టడాలుగానే మిగిలిపోయాయి. దీంతో ఎక్కడ ఒక్క చుక్క నీరు కూడా లేక వెలవెలబోతున్నాయి. మూగ జీవాలు ప్రస్తుతం ఎండలు మండు తుండటంతో భానుడి ప్రతాపానికి గుంటలు , వాగులు ఎండి పోయాయి. అడవి నుంచి వచ్చే మూగజీవాలు , మేతకు వెళ్లే పశువులు తాగునీరు దొరక్క అల్లాడిపోతున్నాయి. నీటి కోసం కిలోమీటర్ల మేర వెతుకులాట తప్పడం లేదని పశువుల కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోకముందే అధికారులు స్పందించాలని స్థానికులు కోరు తున్నారు. నోరు లేని జీవాల దాహార్తిని గుర్తించి , అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి మూగజీవాల కోసం నిర్మించిన వాటర్ ట్యాంకుల్లో నీరు నింపాలని , పలువురు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article
6 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *