ప్రధాన రహదారులపై గుంతలకు మరమ్మతులు చేపట్టాలి….

Fasiuddin Mohammed
1 Min Read

వలిగొండ,ఆగస్టు18 రాయల్ పోస్ట్ న్యూస్ /
భువనగిరి–చిట్యాల ప్రధాన రహదారితో పాటు మండలంలోని వివిధ రోడ్లపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చి మరమ్మతులు చేపట్టాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బొళ్ల సుదర్శన్ డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరి–చిట్యాల ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులు దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గుంతల్లో పడి ప్రమాదాలు జరిగి పలువురు గాయపడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
ప్రతిపక్ష నాయకులు ధర్నాలు చేపట్టినా అధికారుల్లో స్పందన కనిపించడం లేదని అన్నారు. రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సంబంధిత అధికారుల కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టి ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బంధారపు లింగస్వామి, రాచకొండ కృష్ణ, రాస వెంకట్, బచ్చు శ్రీనివాస్, పాక పుల్లయ్య, బొడిగె ఆనంద్, కందుల తానేష్, మంద నరసింహ, రావుల పద్మారెడ్డి, మందుల నాగరాజు, రంజిత్ రెడ్డి, దయాకర్, వెంకటేష్, శ్రీనివాస్, మహేష్, మండల నాయకులు వెంకటేష్, ఎర్రవోలు జంగయ్య, అరుణ్, మచ్చగిరి, అశోక్, లింగస్వామి, వివిధ గ్రామాల నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article