రాయల్ పోస్ట్ న్యూస్ ఆగస్ట్ 9 భువనగిరి మండలం/ నారగుట్ట ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న క్రషర్కు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ తుక్కాపురం, గౌస్ నగర్, ఎర్రంబెల్లి, నమాత్ పల్లి గ్రామాల ప్రజలు మరియు గ్రామాల నాయకులు జేఏసీ -(JAC) ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిగారికి ఆదివారం ఉదయంక్యాంప్ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కన్వీనర్ పుట్ట వీరేష్ యాదవ్ కో కన్వీనర్ వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ, నారగుట్టపై క్రషర్ ఏర్పాటుకు అనుమతి ఇస్తే భవిష్యత్తులో తీవ్ర పర్యావరణ కాలుష్యం, దుమ్ము మరియు శబ్ద కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే వ్యవసాయ భూములకు నష్టం కలగడంతో పాటు పశువులకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో నారగుట్టపై క్రషర్కు ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు సమస్యను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి మండల అధ్యక్షులు ఎల్లంల జంగయ్య యాదవ్ జేఏసీ కో కన్వీనర్ లు ఎల్లంల వెంకటేష్ యాదవ్ జనగాం సత్తయ్య పెద్దిటి కొండల్ రెడ్డి పాక జహంగీర్ గుండెబోయిన దానయ్య గడ్డల నరేష్ యాదవ్, నల్లమాస రవి గౌడ్,మరి సోమిరెడ్డి, రత్నపురం శ్రీను,ముంతా సతీష్ యాదవ, రాసాల వెంకటేష్ యాదవ్ కాసాని వెంకటేష్,వల్లపు లింగస్వామి యాదవ్,పడమటి జంగారెడ్డి, రత్నపురం సురేందర్,సిరికొండ శ్రీకాంత్ ,గొర్ల శ్రీను,పాశం ప్రసాద్
వల్లపు పర్వతాలు జక్కుల సత్తయ్య గజ్జి పరమేష్ యాదవ్,నల్లమాస సాయిరాం గౌడ్, గడగొట్ల వెంకటేష్, పిట్టల కిరణ్, రాచకొండ ప్రకాష్, ఏదునూరి సాయికుమార్, గడసందుల వర్ధన్, వల్లపు నిఖిల్, వల్లపు మని, గుంటి చింటూ, రసాల శివ, రాసాల మని, గుండెబోయిన సంపత్, గోపగాని ప్రశాంత్, కళ్లెం దావీద్, కళ్లెం ఏసు,
తదితరులు పాల్గొనారు.
