రాయల్ పోస్ట్ న్యూస్ కాచిగూడ, ఆగస్టు 09: బోనాల వేడుకల సందర్భంగా ఆదివారం కాచిగూడ, చెప్పల్ బజార్ లో బుజ్జిలి మహాంకాళి అమ్మవారి విగ్రహాన్ని యంగ్ మెన్ అసోసియేషన్ బోనాల వేడుకల నిర్వహకులు లడ్డూ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి ఆలయం నుంచి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. మూడు రోజలు బోనాల వేడుకల అనంతరం తిరిగి అమ్మవారి విగ్రహాన్ని సికింద్రాబాద్ ఉజ్జని మహాంకాళి అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్తారు. ఈ సందర్భంగా పలహారం బండి ఊరేగింపును అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. 10వ తేదీన సోమవారం అమ్మవారి రథోత్సవం ఉంటుంది. చిట్టబోయిన వినోద్ యాదవ్, నందు, సత్యనారాయణ, తదితరులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
