రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి టౌన్, ఆగస్ట్ 4/ ద్రి భువనగిరి జిల్లా:భువనగిరి పట్టణంలోని 21వ వార్డ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణిరవి కుమార్ గారు మరియు స్థానిక కౌన్సిలర్ వంగేటి సుచరిత గారి తో కలిసి దుప్పట్లు, పుస్తకాలు, ప్లేట్లు, వాటర్ గ్లాసులను అందజేశారు.ఈ సందర్భంగా చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణిరవి కుమార్ మాట్లాడుతూ…
“విద్యార్థుల సంక్షేమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. హాస్టల్ లో చదివే బీసీ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. చదువుతో పాటు ఆరోగ్యం, పరిశుభ్రత కూడా ముఖ్యం. అందుకే దుప్పట్లు, పుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు అందిస్తున్నాం. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి” అని అన్నారుఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ తంగళ్లపల్లి రవికుమార్ వైస్ చైర్మన్ పోతాంశెట్టి మంజుల, మున్సిపల్ కమిషనర్ చంద్ర ప్రకాష్ కౌన్సిలర్ వంగేటి సుచరిత రెడ్డి, నాయకులు శనిగల సాయి రాజు, హమీద్, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.