అక్రమ ఇసుక ట్రాక్టర్లు సీజ్..

1 Min Read

పాపన్నపేట జూలై 19 రాయల్ పోస్ట్ న్యూస్

మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఆదివారం సిబ్బందితో కలిసి వెళ్లి చూడగా ఇసుక లోడ్ కలిగిన 3ట్రాక్టర్లు, ఇసుక తరలించేందుకు ప్రయత్నించిన మరో 6ట్రాక్టర్లను పట్టుకుని ఠాణాకు తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ట్రాక్టర్ లను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.మండలంలో మంజీరా నది, చెరువుల నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

📄 Generate e-Paper Clip
Share This Article