రాయల్ పోస్ట్ న్యూస్ జనగాం జులై 18/హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో జనగామ పట్టణ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ఉల్లెంగుల సందీప్, బీఆర్ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు తిరుమల్ రెడ్డి, యువజన నాయకులు సురేష్ గౌడ్, శ్రవణ్, టౌకిర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సదస్సులో పార్టీ అధినేతల ప్రసంగాలను ఆసక్తిగా విన్న నాయకులు, రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగం, ఉద్యోగాల కల్పన, యువత హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన కార్యాచరణకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.
యువత భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని, యువశక్తిని సంఘటితం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనగామ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.