రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 14/
భువనగిరి 94 అసెంబ్లీ నియోజకవర్గంలోని 21, 22, 23, 24 వార్డుల పరిధిలో ఉన్న బూత్ నంబర్లు 65, 85, 86, 87, 88, 89, 90లలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్,ఆబాది ఎస్ఐఆర్ పరిశీలన ఇంచార్జ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను స్వయంగా నింపించి, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహకరించారు.
ఈ సందర్భంగా బర్రె జహంగీర్ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైనదని, ప్రతి అర్హుడైన ఓటరు నిర్భయంగా తన వివరాలను నమోదు చేసుకునేలా అధికారులు, బీఎల్వోలు ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు.బీఎల్ఓలు సర్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈనెల 14న చివరి తేది అన్ని చెప్పడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈనెల 24 వరకు అవకాశం ఉందని తెలిసిన కూడా బీఎల్వోలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని అన్నారు. బీఎల్ఓ లు ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయకుండా, సందేహాలను నివృత్తి చేస్తూ స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
అలాగే, అర్హులైన ప్రతి ఓటరు తమ పేర్లు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా ఎన్యుమరేషన్ ఫారాలను తప్పనిసరిగా సమర్పించాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా బీఎల్వోలు లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే ప్రతి ఓటు విలువైనదని, అందరూ స్వచ్ఛందంగా SIR ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన వెంట మాజీ కౌన్సిలర్ ఈరపాక నరసింహ, ఉట్కూరి చక్రధర్ గౌడ్, బర్రె క్రాంతి కుమార్, కసర బోయిన సాయికుమార్ ఉన్నారు.
