రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 14/

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుజక్కిటి శివ చరణ్ రెడ్డి అహంకారాన్ని వీడి, శ్రీ లక్ష్మీనరసింహ ట్రస్ట్ బోర్డ్ మెంబర్గా ఎంపికైన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ కు బేసరత్తుగా క్షమాపణ చెప్పాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర కోశాధికారి కొత్తపల్లి ఆనంద్ యాదవ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర అధ్యక్షులు చలాకాని వెంకట్ యాదవ్ గారి ఆదేశాల మేరకు మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలో శెట్టి బాలయ్య యాదవ్ స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా సలహాదారులు మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి సామాజిక కార్యకర్తగా ఈశ్వరమ్మ యాదవ్ ఎనలేని సేవలు చేసినటువంటి మహోన్నత వ్యక్తిని, అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని అన్నారు. పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ తన జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, తెలంగాణ రాష్ట్రంలోనే ఆమె యాదవులకు సుప్ర సిద్దురాలని , అటువంటి గొప్ప చరిత్ర గల వ్యక్తిపై దూషణలు అవాంఛనీయమని, హేయమైనవని వారు అన్నారు. ఇప్పటికైనా ఈశ్వరమ్మ యాదవ్ పై చేసిన అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ లేనియెడల, యాదవ సమాజం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు తోటకూర యాదయ్య యాదవ్, గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమం లొ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ పాక జహంగీర్ యాదవ్,
జిల్లా ఉపాధ్యక్షులు రాసాల లింగస్వామి యాదవ్, సభ్యులు ఎర్ర సాని సాయి యాదవ్, బొల్లెమోని భాస్కర్ యాదవ్, కడారి నవీన్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు.