royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaభువనగిరి లో ఏపూరి సోమన్న “25 ఏండ్ల పాటల ప్రవాహం”… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 10:21 pm
Date of Publish : 11 Sep 2026, 7:12 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 3 💬 0
Latest News

భువనగిరి లో ఏపూరి సోమన్న “25 ఏండ్ల పాటల ప్రవాహం” సభ ప్రజలను చైతన్య పరిచే పాటకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించాలి..సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి

భువనగిరి లో ఏపూరి సోమన్న “25 ఏండ్ల పాటల ప్రవాహం” సభ ప్రజలను చైతన్య పరిచే పాటకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించాలి..సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి సెప్టెంబర్ 10/ ప్రజా కళాకారుడు, ప్రజా యుద్ధనౌక ఏపూరి సోమన్న పాటకు 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా గురువారం భువనగిరిలో ఏ ఆర్ గార్డెన్ లో పాటల ప్రవాహం సభ జరిగింది. ఈ సభకు ప్రజా కళాకారుడు మీసాల గణేష్ అధ్యక్షత వహించగా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ ఏపూరి సోమన్న జీవితంలో సగం జీవితం ప్రజా కళాకారుడిగా ప్రజలను చైతన్య పరిచాడని ఆయన అన్నారు. ఏపూరి సోమన్న సేవలను ప్రజలు గుండెల్లో దాచుకుంటారని ఆయన అన్నారు. ప్రజా కళాకారులకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించాలని ఈ సభ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలని ఆయన అన్నారు. ఏపూరి సోమన్న చట్టసభలకు వేళ్ళే వరకు మనమంతా సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏపూరి సోమన్న పాటకు "25 ఏండ్ల పాటలు ప్రవాహం" పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరుశురాం, జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్, ఎం ఆర్ పి ఎస్ జిల్లా నాయకులు చిలుకమారి గణేష్, ఐ లు జిల్లా అధ్యక్షులు బొల్లేపల్లి కుమార్, కవి బైరపాక స్వామి, కళాకారులు ఎర్ర సూర్యం ,మహిళా కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు