royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaమేము ప్రభుత్వాలకు పాలకులకు వ్యతిరేకులు కాదు మా సమస్యలను వెంటనే… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 11:18 pm
Date of Publish : 11 Sep 2026, 6:41 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 2 💬 0
Latest News

మేము ప్రభుత్వాలకు పాలకులకు వ్యతిరేకులు కాదు మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి….. రైస్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మార్త వెంకటేశం…..

మేము ప్రభుత్వాలకు పాలకులకు వ్యతిరేకులు కాదు మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి….. రైస్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మార్త వెంకటేశం…..

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి సెప్టెంబర్ 10/
రాష్ట్ర రైస్ మిల్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ, ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర నాయకులు పసుపునూరి
నాగభూషణం,
జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులతో పాటు హమాలీలు, కూలీలు ఇతర సిబ్బంది వేలాదిమంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన రహదారి పై ప్రదర్శనగా కలెక్టర్ కార్యాలయం వైపు కదిలారు.
మేము ప్రభుత్వాలకు, పాలకులకు వ్యతిరేకులము కాదూ ,మా న్యాయమైన సమస్యల వెంటనే పరిష్కరించాలని కోరారు. అసోసియేషన్ తరపున కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనాధికారి అంజిరెడ్డికి, సివిల్ సప్లై అధికారి ని రోజా రమణి కి వినతిపత్రంతో మొరపెట్టుకున్నారు. సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో మూసి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నందున రా రైస్ సాధ్యపడదు అన్నారు.న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం,అవసరమైతే తమ ఉద్యమానికి మద్దతుగా రైతులను విద్యార్థులను మద్దతు తీసుకుంటామన్నారు.అధికారులకు, ప్రభుత్వానికి వాస్తవ సమస్యలు తెలిసినప్పటికీ తెలవనట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
రానున్న ధాన్యము కొనుగోళ్లకు సంబంధించిన విధి విధానాలు ప్రకటించిన తర్వాత ధాన్యాన్ని కేటాయించాలన్నారు. మేము ధర్మం వైపు నడుస్తామని, అన్ని జిల్లాలకు ఒకే ప్రామాణికత సరి అయింది కాదన్నారు.
రైస్ మిల్ ఇండస్ట్రీ ద్వారా ప్రత్యక్షంగా,పరోక్షంగా
ప్రజలకు ఉపాధి, ప్రభుత్వానికి 100 విభాగాలలో అనుసంధానంగా ఆదాయం సమకూర్చడం జరుగుతుందన్నారు. ఎందరో పేద ప్రజలకు
ఉపాధి కల్పించె రైస్ మిల్ ఇండస్ట్రీ నెలల తరబడి కాలయాపన చేయకుండా, పరిస్థితులను చక్క దిద్దాలని వేడుకున్నారు. కార్యక్రమంలో పసుపునూరి మనోహర్,పెద్ది మురళి, జెల్లా వెంకటరమణ, అశోక్ రైస్ మిల్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.