royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaబాపూజీనగర్ బస్తీల్లో వెలుగులు నింపిన స్ట్రీట్ లైట్లు › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 7:01 pm
Date of Publish : 23 Aug 2026, 10:06 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 14 💬 0
Latest News

బాపూజీనగర్ బస్తీల్లో వెలుగులు నింపిన స్ట్రీట్ లైట్లు

బాపూజీనగర్ బస్తీల్లో వెలుగులు నింపిన స్ట్రీట్ లైట్లు
రాయల్ పోస్ట్ న్యూస్ ముషీరాబాద్, ఆగస్టు 23: ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్ పరిధిలోని పలు బస్తీలు, కాలనీల్లో స్ట్రీట్ లైట్లు పనిచేయకపోవడంతో రాత్రివేళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను స్థానికులు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి స్ట్రీట్ లైట్ల మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత పూస గోరక్ నాథ్ విద్యుత్ దీపాల మరమ్మత్ పనులను పర్యవేక్షించారు. దీంతో బస్తీలు, కాలనీల్లో వీధి దీపాలు తిరిగి వెలుగులు నింపాయి.
స్ట్రీట్ లైట్ల సమస్యను తక్షణమే పరిష్కరించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో పాటు యువ నాయకుడు ముఠా జయసింహకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలిపారు.