royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana, 25, 26 తేదీల్లో భువనగిరిలో ఈద్ మిలాద్ ఉన్… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 7:40 pm
Date of Publish : 23 Aug 2026, 7:58 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 17 💬 0
Latest News

, 25, 26 తేదీల్లో భువనగిరిలో ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు….జలీల్ పుర మస్జీద్ కమిటీ అధ్యక్షుడు ఇక్బాల్ చౌదరి

, 25,   26 తేదీల్లో భువనగిరిలో ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు….జలీల్ పుర మస్జీద్ కమిటీ అధ్యక్షుడు ఇక్బాల్ చౌదరి

భువనగిరి రాయల్ పోస్ట్ న్యూస్ ఆగస్ట్ 23/

మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 25, 26 తేదీల్లో భువనగిరి పట్టణంలో ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు జలీల్ పుర మస్జీద్ కమిటీ అధ్యక్షుడు ఇక్బాల్ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈనెల 25 (మంగళవారం) రాత్రి 8 గంటలకు జలీల్ పుర మస్జీద్ ఆవరణలో ‘మిలాద్ ఉన్ నబీ’ బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సభలో పలువురు మత పెద్దలు ధార్మిక ప్రసంగాలు చేయనున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా, ఈనెల 26 (బుధవారం) ఉదయం 9 గంటలకు స్థానిక జలీల్ పుర మస్జీద్ నుండి మిలాద్ ఉన్ నబీ శోభాయాత్ర (ర్యాలీ) ప్రారంభమవుతుందని తెలిపారు. ర్యాలీ ముగిసిన అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఈ బహిరంగ సభకు మరియు ర్యాలీకి భువనగిరి పట్టణంలోని ముస్లిం సోదరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఇక్బాల్ చౌదరి కోరారు.