royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaతాజ్‌పూర్‌లో ఘనంగా బోనాల పండుగ… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 8:24 pm
Date of Publish : 23 Aug 2026, 7:47 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 16 💬 0
Latest News

తాజ్‌పూర్‌లో ఘనంగా బోనాల పండుగ…

తాజ్‌పూర్‌లో ఘనంగా బోనాల పండుగ…

తాజ్‌పూర్‌లో ఘనంగా బోనాల పండుగ

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలో బోనాల పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, శివశక్తుల శిగలతో పండుగ వాతావరణం నెలకొంది.

మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలను అలంకరించుకుని, తలపై బోనాలతో ఊరేగింపుగా గ్రామంలోని గ్రామదేవతల ఆలయాల వద్దకు చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. గ్రామదేవతల ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామంలో ఎలాంటి కష్టాలు, అనారోగ్యాలు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొనాలని భక్తులు కోరుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. గ్రామదేవతలను భక్తిశ్రద్ధలతో కొలుచుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ప్రతి ఏటా గ్రామంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో పండుగలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు సర్పంచ్ తెలిపారు. అనంతరం గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, శివశక్తుల నృత్యాలతో తాజ్‌పూర్ గ్రామంలో పండుగ సందడి నెలకొంది.

భక్తిశ్రద్ధలతో సాగిన బోనాల వేడుకలు గ్రామస్థులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల పండుగను విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, ఎస్కే గాలిబి యాకుబ్, బొమ్మరపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మీ బాలరాజు, బిట్కూరు మహేష్, వరిగంటి మానస నాగరాజు, ఎస్కేహైమద్ మరియు గ్రామా ప్రజలు పాల్గొన్నారు.