రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 21: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అంబర్‌పేట్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్విమ్మింగ్ పూల్‌లో ఆగస్టు 15న నిర్వహించిన 11వ తెలంగాణ మాస్టర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ –2026లో అంబర్‌పేట్ క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు.
ఇంద్రసేన యాదవ్ ఐదు స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు. వి. రమణ నాలుగు పతకాలు, రాజ్‌కుమార్ సురానా నాలుగు స్వర్ణాలు, ఒక రజత పతకం, మధు మూడు స్వర్ణాలు, రెండు రజత పతకాలు, మురళీధర్ రెడ్డి రెండు రజత పతకాలు సాధించి జట్టు విజయానికి తోడ్పడ్డారు.
విజేతలను అంబర్‌పేట్ మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జి. మల్లేష్ యాదవ్, రమేష్ గౌడ్, ఎం. శంకర్ ముదిరాజ్, అమృత్ రెడ్డి, శ్రీనివాస్ బాబా, రాజశేఖర్ రెడ్డి, శివ, ప్రభాకర్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారుల విజయానికి కోచ్‌లు కె. సురేష్, ప్రశాంత్, సుదీర్, కృష్ణ, గిరి కృషి చేసినందుకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు.