royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaమున్సిపల్ ఉద్యోగి చింతల విజయ్ గారి మృతిపట్ల సంతాపం… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 8:26 pm
Date of Publish : 21 Aug 2026, 5:30 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 15 💬 0
Latest News

మున్సిపల్ ఉద్యోగి చింతల విజయ్ గారి మృతిపట్ల సంతాపం…

మున్సిపల్ ఉద్యోగి చింతల విజయ్ గారి మృతిపట్ల సంతాపం…

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 21/ భువనగిరి మున్సిపాలిటీ ఔట్ సోర్సింగ్ శానిటేషన్ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్న చింతల విజయ్ గారు ఈరోజు 21-08-2026 న ఆకస్మికంగా మృతి చెందారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కె చంద్ర ప్రకాష్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, చింతల విజయ్ గారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారికి భువనగిరి మున్సిపాలిటీ తరపున అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేేశి, వారి కుటుంబానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాలత్యా వెంకటేశ్ , కో-ఆప్షన్ సభ్యులు పల్లెర్ల యాదగిరి , నాయకులు తంగళ్ల పల్లి రవికుమార్ , మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.