royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaనిరుద్యోగుల కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను అమలు… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 10:34 pm
Date of Publish : 20 Aug 2026, 6:23 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 8 💬 0
Latest News

నిరుద్యోగుల కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను అమలు చేయాలి….

నిరుద్యోగుల కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను అమలు చేయాలి….

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 20/ కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాల క్రితం ఎన్నికల ముందు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల ముందు హామీని అమలు చేయాలని తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చే సమయంలో ఎవరు లేకపోవడం ఆఫీసు గేటు కే వినతిపత్రం అతికించడం జరిగింది. సిపిఐ ఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం జరిగింది. ఈ రెండు పార్టీలు ఎన్నికల ముందు హామీలను తుంగలో తొక్కి ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు యువతను పేరుతో ఉద్యోగాస్తులను మోసం చేస్తూ ప్రభుత్వాలు పబ్బం గడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తానని రెండు సంవత్సరాలు పూర్తయిపోయినా కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నది. వెంటనే హామీని అమలు చేయాలని లేదా ఉద్యోగాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. హామీలను అమలుపరచకుంటే నిరుద్యోగులను జమచేసి ఏకం చేసి పోరాటాలకు దశలవారీగా సిద్ధమవుతామని సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, లౌడియా రాజు పట్టణ డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు మేడబోయిన సుందర్ ,ఎండి సలీం, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు నేహాల్, ఈర్ల రాహుల్, గర్ల్స్ కన్వీనర్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సింధూర రాణి, ప్రసన్న, అరవింద్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.