royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaబస్వాపురం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి విడుదల… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 14 Sep 2026, 1:17 am
Date of Publish : 20 Aug 2026, 6:16 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 15 💬 0
Latest News

బస్వాపురం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి విడుదల చేయాలి– ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి– జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కోసం సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రను, మహాధర్నాను జయప్రదం చేయండి– సీపీఎం రాష్ట్ర కమిటీ కొండమడుగు నర్సింహ్మ

బస్వాపురం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి విడుదల చేయాలి– ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి– జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కోసం సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రను, మహాధర్నాను జయప్రదం చేయండి– సీపీఎం రాష్ట్ర కమిటీ కొండమడుగు నర్సింహ్మ

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 20/ బస్వాపురం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వము తక్షణం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి విడుదల చేసి పూర్తిచేయాలని, ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటిని విడుదల చేసి వర్షాభావ పరిస్థితులలో ఎండిపోతున్న వరి పోలాలకు నీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలి సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం సీపీఎం గ్రామ శాఖ సమావేశం కొండ హైమావతి అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా నర్సింహ హాజరై మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా బీడుబడ్డ భూములను సాగులోకి తేవాలన్నా, వ్యవసాయ మీద ఆధారపడ్డ రైతులకు, వ్యవసాయ కూలీలకు, వృత్తిదారులకు ఉపాధి కల్పించాలన్న నీళ్లు చాలా అవసరమని తెలిపారు. నీళ్లు అందించడానికి నిర్మాణాలు చేపట్టిన ప్రాజెక్టులకు ఎందుకు నిధులు కేటాయించి పూర్తి చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సంవత్సరాలు గడిచిన చిన్ననీటి కాలువలను కూడా పూర్తి చేయలేని పాలక పార్టీల అసమర్ధత కొనసాగుతుందని విమర్శించారు. ప్రజల స్థితిగతులు మార్పులు రావాలన్న, ఆర్థికంగా బలపడాలన్న, విద్యా, వైద్యపరంగా ముందుకు పోవాలన్నా ఉపాధి కీలకమని తెలిపారు. ప్రభుత్వాలు ఇప్పుడు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల వల్ల అందరికీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు లేనందున కనీసం నీటి వసతన్న కల్పిస్తే వ్యవసాయం అభివృద్ధి చెందితే నిరుద్యోగ సమస్య కూడా కొంతమేరకు పరిష్కారమయ్యే అవకాశం ఉందని అందుకు పాలకులు చిత్తశుద్ధితో యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులను, కాలువలను పూర్తి చేయడానికి తక్షణం నిధులు కేటాయించి పూర్తి చేయాలని అన్నారు. పెండింగులో ఉన్న ప్రాజెక్టులకు, కాలువలకు నిధులు కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో భువనగిరి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి హైదరాబాదులోని ఇంద్రపార్క్ ధర్నా చౌకు వరకు పాదయాత్ర మరియు 31న నిర్వహిస్తున్న మహాధర్నాలో ప్రజలు, రైతులు వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్, కొండమడుగు నాగమణి, శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ, సభ్యులు కొండ లక్ష్మయ్య, కాసారపు మల్లయ్య, కూకుట్ల చొక్కాకుమారి తదితరులు పాల్గొన్నారు.