royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana4 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి…జిఎంపిఎస్ మండల కార్యదర్శి… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 20 Aug 2026, 3:21 pm
Date of Publish : 20 Aug 2026, 12:33 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 3 💬 0
Latest News

4 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి…జిఎంపిఎస్ మండల కార్యదర్శి పాక జహంగీర్…

4 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి…జిఎంపిఎస్ మండల కార్యదర్శి పాక జహంగీర్…

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్టు 20,రామకృష్ణాపురంఈనెల 22, 23 , 24 తేదీలలో చెంగిచెర్ల లో నిర్వహించే రాష్ట్ర 4 వ మహాసభలను జయప్రదం చేయాలని గొర్రెల మేకల పెంపకదారుల సంఘం మండల కార్యదర్శి పాక జహంగీర్ కోరారు. గురువారం భువనగిరి మండలంలోని రామకృష్ణాపురం లో జి ఎం పి ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో 4 వ రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి, మాట్లాడారు. గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 22వ తేదీన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చెంగిచెర్ల లో ర్యాలీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా సబ్సిడీపై గొర్రెల పంపిణీ అనగా నగదు బదులు పథకాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని, గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, గొర్రెల మందకు వచ్చి పశువైద్యాధికారులు
వైద్యం చేయాలని కోరారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో గొల్ల కురుమలకు యువతకు ప్రత్యేక రాయితి కల్పించాలని కోరారు. సీజనల్ రోగాలపై అవగాహన కల్పిస్తూ, మండల వద్ద సంబంధిత టీకాలను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ, గొర్రెలకు వైద్యం అందించని డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. సబ్ సెంటర్ లను జిల్లా అధికారులు తనిఖీ చేసి, గొర్రెల వైద్యం పురోగతిపై సమీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ మండల ఉపాధ్యక్షులు తోటకూర అశోక్,
ఆయా గ్రామాల సొసైటీ అధ్యక్షులు బాల్ద రవి, మాజీ జెడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య, సుబ్బురు శ్రీశైలం, బండ వెంకటేష్, బాల్ద రాములు, బాల్ద మహేష్, చిన్నం సత్యనారాయణ, భూమయ్య, సుబ్బురు రవి సుబ్బురు కొండలు పాల్గొన్నారు.